తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హింసాత్మక ఘటనలతో బంగాల్​ ప్రజలు సతమతం' - bengal governer jagdeep

బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​ నందిగ్రామ్​లోని కేండా మారి జల్​పాయ్​ గ్రామంలో శనివారం పర్యటించారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంపై.. కరోనా, ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.

బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్, bengal governer jagdeep
బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​

By

Published : May 15, 2021, 12:07 PM IST

బంగాల్​ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలతో ప్రజలు సతమతవుతున్నారని గవర్నర్​ జగదీప్​ ధనకర్​ అభిప్రాయపడ్డారు. నందిగ్రామ్​లోని కేండా మారి జల్పాయ్​ గ్రామాన్ని సందర్శించారు ధనకర్​. హింసాత్మక ఘటనలపై మమత దృష్టి సారించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

"కరోనా, ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో రాష్ట్రం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులపై మమత దృష్టి సారించాలని నేను కోరుతున్నాను. లక్షలాది మంది ప్రజలు సతమతమవుతున్నారు. తగిన చర్యలు చేపట్టి ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం మమత కృషి చేస్తారని నేను ఆశిస్తున్నా."

- జగదీప్​ ధన్​కర్​, బంగాల్​ గవర్నర్​.

బంగాల్​ ఎన్నికల్లో టీఎంసీ గెలుపొందింది. కానీ ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టారు గవర్నర్​.

ఇదీ చదవండి :కర్ణాటక నుంచి బైడెన్​, కమల​కు మాస్కులు

ABOUT THE AUTHOR

...view details