తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మధ్య తరగతిని రూపుమాపే యత్నాల్లో కేంద్రం!' - మీమ్ అఫ్జల్, కాంగ్రెస్​ నేత

దేశంలో మధ్యతరగతిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్ ​తీవ్ర విమర్శలు చేశారు. ప్యూ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైందని 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

"Government wants to end middle class in India": Congress on Pew report
'దేశంలో మధ్యతరగతిని తొలగించాలని చూస్తోన్న కేంద్రం'

By

Published : Mar 21, 2021, 3:23 PM IST

'దేశంలో మధ్యతరగతిని తొలగించాలని చూస్తోన్న కేంద్రం'

దేశంలో మధ్య తరగతి ప్రజలే లేకుండా చేసి.. తన కార్పొరేట్​ మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్. ఇటీవల ప్యూ సంస్థ విడుదల చేసిన నివేదికలోనూ ఇదే స్పష్టమైందని 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కొవిడ్​-19ను కట్టడి చేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా దాదాపు 3.2 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి వెళ్లారన్న ప్యూ నివేదికను ఆసరాగా చేసుకుని కేంద్రంపై ఈమేరకు విమర్శలు గుప్పించారు మీమ్​ అఫ్జల్.

"గతంతో పోలిస్తే దేశంలో మధ్యతరగతి ప్రజల శాతం గణనీయంగా తగ్గిపోయింది. దీన్ని బట్టి చూస్తే దేశంలోని మధ్యతరగతిని రూపుమాపేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దేశాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టాలని చూస్తోంది. మొత్తం ధనాన్ని కార్పొరేట్​ మిత్రుల చేతిలో పెట్టి దేశాన్ని పేదరికంలోకి నెట్టివేయాలని చూస్తోంది."

-- మీమ్ అఫ్జల్, కాంగ్రెస్​ నేత

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ఎన్నికల ప్రచారం నిర్వహించే రాజకీయ నేతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అఫ్జల్.

ఇదీ చదవండి :'అసోం వరదలపై మోదీ మౌనమేల?'

ABOUT THE AUTHOR

...view details