దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నా.. ఇది మరింత వేగంగా జరగాల్సి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వైద్య నిపుణులు ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు ఉన్న అన్ని వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలని చెబుతున్నారు.
ప్రారంభంలో నెమ్మదిగా సాగిన టీకా పంపిణీ కార్యక్రమం.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని ఐసీఎంఆర్ సీనియర్ సలహాదారు డా. సునీలా గార్గ్ పేర్కొన్నారు. దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న అపోహలతో ప్రజలు.. టీకా తీసుకునేందుకు తొలుత వెనకంజ వేశారని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగైనందున.. వ్యాక్సినేషన్ కోసం కొత్త వ్యూహాలకు పదును పెట్టాలని సూచించారు.
"వ్యాక్సినేషన్ కోసం వినూత్న, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలి. దేశంలో 540 మెడికల్ కాలేజీలు, 60 పీజీ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రతి కళాశాలకు స్థానికంగా కొంత పరిధి ఉంటుంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు టీకా అందించాల్సిన బాధ్యత వారికి అప్పగించాలి."
-డా. సునీలా గార్గ్, ఐసీఎంఆర్ సీనియర్ సలహాదారు
'కారణమదే'