తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2021, 10:21 PM IST

Updated : Dec 20, 2021, 11:00 PM IST

ETV Bharat / bharat

టీచర్ల విరాళాలతో సర్కారీ బడికి కార్పొరేట్ హంగులు!

Chhindwara government school: అదో ప్రభుత్వ బడి. కానీ ఆ పాఠశాలలో అడుగు పెట్టిన వారెవరికైనా.. తాము ఏ కార్పొరేట్ పాఠశాలకో వచ్చామోనని అనిపించక మానదు. ఎందుకంటే.. ప్రైవేట్​ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సకల వసతులు ఆ బడిలో ఉంటాయి మరి. ఆ బడి ఇలా రూపుదిద్దుకోవడం వెనుక అక్కడి ముగ్గురు ఉపాధ్యాయుల కృషి మాత్రమేనని చెబితే నమ్మగలరా?

Chhindwara government school
టీచర్ల విరాళాలతో సర్కారీ బడికి కార్పొరేట్ హంగులు!

టీచర్ల విరాళాలతో సర్కారీ బడికి కార్పొరేట్ హంగులు!

Chhindwara government school: ప్రభుత్వ పాఠశాల అంటే... 'వసతుల లేమి, ఉపాధ్యాయులు వేళకు రారు, పిల్లలను పట్టించుకోరు' వంటి అభిప్రాయాలు చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటాయి. ఇక అలాంటి వారు వేలకొద్దీ డబ్బులు పోసైనా సరే తమ పిల్లలను ప్రైవేట్​ స్కూళ్లకే పంపిస్తారు. అయితే.. మధ్యప్రదేశ్​ ఛింద్​​వాడా జిల్లాలోని ఓ స్కూల్​ను చూస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అభిప్రాయాలు పూర్తి అవాస్తవాలు అని నిరూపితమవుతాయి.

కార్పొరేట్ బడులకు ఏమాత్రం తీసిపోని రీతిలో... ఛింద్​​వాడా జిల్లా ఘోఘరీ గ్రామ పాఠశాల ఉంటుంది. సర్కారీ బడి ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధో లేక దాతల విరాళాలో అనుకుంటే పొరపాటు. ఇదంతా ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల స్వీయ కృషి.

అందమైన తరగతి గది

మళ్లీ రప్పించాలని..

School renovation by teachers: ఘోఘరీ పాఠశాలలో 2016 వరకు చాలా మంది పిల్లలు ఉండేవారు. కానీ, ఆ తర్వాత ఏడాది నుంచి పిల్లల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించసాగారు. ఈ పరిస్థితిని గమనించిన అక్కడి ముగ్గురు ఉపాధ్యాయులు... తమ స్కూల్​ను సైతం ప్రైవేట్​ పాఠశాలలా తీర్చి దిద్దాలని భావించారు. ప్రైవేట్ బాట పట్టిన విద్యార్థులను మళ్లీ ప్రభుత్వ బడికి తిరిగి వచ్చేలా చేయాలని నిశ్చయించుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ
పాఠశాలలో విద్యార్థుల కోసం ఆట వస్తువులు

ఇదీ చూడండి:బ్లాక్​ ఇడ్లీ.. ఆ టిఫిన్​ సెంటర్ స్పెషాలిటీ.. టేస్ట్​ చేసేందుకు జనం క్యూ!

ఒకశాతం జీతంతో..

Teachers salary for school: అయితే.. ఇందుకోసం ఎవరిపై ఆధారపడకుండా తమ సొంత ఖర్చులతోనే పాఠశాలను పునరుద్ధరించుకోవడానికి సిద్ధమయ్యారు ఉపాధ్యాయులు. తమ జీతాల్లోంచి ప్రతి నెలా ఒక శాతం డబ్బును ఈ పాఠశాల పునరుద్ధరణ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. అలా 2016 నుంచి ఇప్పటివరకు డబ్బులను జమ చేస్తూ వాటితో పాఠశాలలో క్రమక్రమంగా సకల వసతులను కల్పించసాగారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పాఠశాల ప్రైవేట్ పాఠశాల కంటే ఎంతో మెరుగ్గా తయారైంది.

ప్రొజెక్టర్​తో విద్యా బోధన
స్మార్ట్​ క్లాస్​ రూంకు స్వాగతం...

"ఇక్కడకు పిల్లలు చాలా తక్కువ మంది వస్తుండే వారు. అందుకే మేం టీవీ, ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చెప్పాలని భావించాం. మేం మా జీతాల నుంచి ఒకశాతం డబ్బులను ప్రతి నెలా జమ చేసుకుని విద్యార్థులకు కావాల్సిన పరికరాలను కొనుగోలు చేశాం. ఆట వస్తువులను అందుబాటులో ఉంచాం. ప్రైవేట్ పాఠశాలలో చాలా వసతులు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలోనే అవి ఉన్నట్లయితే..వాళ్లు పాఠశాలకు వెళ్లరు అని ఆలోచించి బడిని ఇలా పునరుద్ధరించాం."

-ఉపాధ్యాయుడు.

ఇదీ చూడండి:మైనస్​లోకి ఉష్ణోగ్రతలు- నీళ్లు కావాలంటే నల్లాలను వేడి చేయాల్సిందే!

అచ్చం మోడల్ స్కూల్​లానే...

Beautiful Government school: ప్రైవేట్ స్కూళ్లలో కనిపించే వసతులన్నీ ఘోఘరీ ప్రభుత్వ పాఠశాలలోనూ ఉంటాయి. విద్యార్థుల కోసం ఇక్కడ ఓ లైబ్రరీని ఏర్పాటు చేశారు. వ్యాయామ విద్యలో భాగంగా వివిధ ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. స్మార్ట్​ క్లాస్​ రూంలను నిర్మించి.. ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. దేశం, ప్రపంచం గురించి సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విద్యార్థుల కోసం ఓ రేడియోను ఏర్పాటు చేశారు.

"ఇక్కడ మాకు రెండు స్మార్ట్​ క్లాస్​ రూంలు ఉన్నాయి. మా బడికి రాని పిల్లలు కూడా వీటి కోసం ఇప్పుడు మళ్లీ ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ మాకు అందమైన క్లాస్ రూంలు ఉన్నాయి. టీవీల ద్వారా మేం చదువుకుంటాం. వాటి వల్ల మాకు సులభంగా పాఠాలు అర్థమవుతున్నాయి."

- విద్యార్థిని.

"మా బడి చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు అన్ని రకాల వసతులు ఉంటాయి. చదువుకోవడానికి, ఆడుకోవడానికి ఎంతో చక్కగా ఉంటుంది. మాకు అర్థం కాని పాఠాలను టీవీ, ప్రొజెక్టర్ ద్వారా చూస్తూ సులభంగా నేర్చుకుంటున్నాం."

-విద్యార్థి.

ఉపాధ్యాయుల కృషి ఫలితంగా ఘోఘరీ పాఠశాలలో ప్రస్తుతం 100 శాతం ఉత్తీర్ణత నమోదవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య తమ పిల్లలకు అందుతోందని తల్లిదండ్రులు కూడా మురిసిపోతున్నారు.

ఇదీ చూడండి:వానరం ప్రేమ.. కుక్కపిల్లను ఎత్తుకుని తిరుగుతూ...

Last Updated : Dec 20, 2021, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details