కరోనా కట్టడి కోసం కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు లేకపోయినా.. 'టీకా ఉత్సవ్' పేరుతో ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పీఎం కేర్స్ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
"ఆసుపత్రుల్లో పరీక్షలు జరపట్లేదు, పడకలు లేవు. ఆక్సిజన్, వెంటిలేటర్ల సదుపాయం లేదు. వ్యాక్సిన్లు కూడా లేవు. కానీ, 'టీకా ఉత్సవ్' మాత్రం ఉంది. పీఎం కేర్స్ నిధులన్నీ ఏమయ్యాయి?"
-రాహుల్ గాంధీ ట్వీట్