Central Government Jobs 2023 : డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నాశిక్‌లోని 'ఇండియా సెక్యూరిటీ ప్రెస్' (ఐఎస్పీ) 108 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
Govt ITI Jobs and Diploma Jobs :
- వెల్ఫేర్ ఆఫీసర్ - 1
- జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్) - 41
- జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) - 41
- జూనియర్ టెక్నీషియన్ (స్టూడియో) - 04
- జూనియర్ టెక్నీషియన్ (స్టోర్) - 04
- జూనియర్ టెక్నీషియన్ (సీఎస్డీ) - 05
- జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) - 01
- జూనియర్ టెక్నీషియన్ (గ్రైండర్) - 01
- జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) - 01
- జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) - 04
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) - 02
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్) - 03
- మొత్తం పోస్టులు - 108
విద్యార్హతలు
ISP Nashik Recruitment Eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ/ డిప్లొమా/ ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మరాఠీ భాష కచ్చితంగా తెలిసి ఉండాలి. ఏదైనా సంస్థ లేదా పరిశ్రమలో వెల్ఫేర్ ఆఫీసర్/ పర్సనల్ ఆఫీసర్/ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
- జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్ లేదా ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి
ISP Nashik Recruitment Age Limit : జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు.. అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 16 నాటికి 18 ఏళ్లు నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు.. అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 16 నాటికి 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.