పార్లమెంటు నూతన భవనం నిర్మాణం, సెంట్రల్ విస్టా పనులను పక్కన పెట్టాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు వేసేందుకే మొగ్గు చూపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసి, 2022 డిసెంబరులో శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును కూడా.. పూర్తిగా మెరుగులు దిద్దిన సెంట్రల్ విస్టా ప్రాంతంలో జరపాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
"రెండు ప్రాజెక్టులకు టెండర్లను కరోనా ఉద్ధృతి కంటే ముందే ఖరారు చేశాం. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటిస్తూ దాదాపు 400 మంది కార్మికులు రెండుచోట్ల పనిచేస్తున్నారు. పెంచిన గడువులోగా మొత్తం ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉన్నందువల్ల సెంట్రల్ విస్టాలో మిగిలిన పనులను తర్వాత చేపడతాం."