ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని గోసాయ్‌గంజ్ (Gosaiganj MLA) నియోజకవర్గ ఎమ్మెల్యే(భాజపా) ఇంద్ర ప్రతాప్ తివారీకి (Indra Pratap Tiwari MLA) ఐదేళ్ల జైలు శిక్ష పడింది. నకిలీ మార్కుల పత్రంతో కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నందుకు స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఆయనకు రూ.8 వేల జరిమానా సైతం విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకొని జైలుకు పంపించారు. (Indra Pratap Tiwari Khabbu Tiwari)
తివారీపై నమోదైన ఈ కేసు ఈ నాటిది కాదు. అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామ్ త్రిపాఠి.. 1992లో ఈయనపై కేసు పెట్టారు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినప్పటికీ.. తప్పుడు మార్క్‌షీట్‌తో తర్వాతి ఏడాదికి అడ్మిషన్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు కాగా.. 13 ఏళ్ల తర్వాత ఛార్జ్‌షీట్ పూర్తైంది. (BJP MLA in UP)