తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌కు బెయిల్‌ - దిల్లీ మద్యం స్కామ్

Delhi Liquor Scam Latest Update: దిల్లీ మద్యం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు అయింది. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్‌ రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది ధర్మాసనం.

Delhi liquor scam
Delhi liquor scam

By

Published : Mar 6, 2023, 3:47 PM IST

Updated : Mar 6, 2023, 4:05 PM IST

Delhi Liquor Scam Latest Update: దేశవ్యాప్తంగా దిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో మలుపులు... కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మద్యం స్కామ్‌లో కీలక వ్యక్తులు అరెస్టు కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవల సీబీఐ ( సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టేగేషన్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.

దిల్లీ మద్యం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ బెయిల్ నిబంధనలతో కూడినట్లు ఉంటుందని స్పష్టం చేసింది. పాస్‌పోర్టు జమ చేయాలని, రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ దిల్లీ మద్యం కేసులో కవిత ఆడిటర్ గోరంట్లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్టు చేసిన బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని పొడగించారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరగా.... సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు కస్టడీని పెంచింది. ఈ విషయంపై తదుపరి విచారణను మార్చి 9 వ తేదీకి వాయిదా వేసింది.

ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశే సిసోదియా కూడా జైలులో ఉండనున్నారు. ఆయనకు కోర్టు.. మార్చి 20 వరకు జ్యుడీషియల్​​ కస్టడీ విధించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ మద్యం కుంభకోణంలో సిసోదియా అరెస్టు అయ్యారు. ఆయన గత వారం రోజులుగా కస్టడీలో ఉన్నారు. సోమవారం ఆయన కస్టడీ ముగియగా.. దిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు.. విచారణ చేపట్టారు. సోదియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు నివేదించగా.. ఆయన అనేక విషయాలు దాచిపెడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఆప్ మద్దతుదారులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. ప్రస్తుతానికి సిసోదియా కస్టడీ తమకు అవసరం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తరువాత అవసరం కావచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇరువురి పక్షాల వాదనలు విన్న కోర్టు.. సిసోదియాకు రెండు వారాలు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 6, 2023, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details