తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రామంలో స్వయంగా శానిటైజ్ చేసిన రవికిషన్

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లోని రజహీ గ్రామాన్ని స్వయంగా శానిటైజ్ చేశారు ఎంపీ రవికిషన్. అనంతరం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

MP Ravi Kishan himself did sanitation
గ్రామాన్ని స్వయంగా శానిటైజ్ చేసిన ఎంపీ రవికిషన్

By

Published : May 25, 2021, 8:25 PM IST

రజహీలో శానిటైజ్ చేస్తోన్న ఎంపీ రవి కిషన్

కరోనా ఉద్ధృతి వేళ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామంలో శానిటైజేషన్​ పనుల్లో స్వయంగా పాల్గొన్నారు నటుడు, ఎంపీ రవికిషన్. గోరఖ్​పుర్​లోని రజహీలో మంగళవారం పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తన స్వహస్తాలతో క్రిమి సంహారక రసాయనాన్ని పిచికారీ చేశారు.

ఇంటికి పిచికారీ చేస్తోన్న ఎంపీ

పరిశుభ్రత పాటించాలి..

వైరస్ కేసులు పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని రవికిషన్ చెప్పారు. భద్రత, పరిశుభ్రత అన్నింటికన్నా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మాస్కులు పంపిణీ చేశారు.

మాస్కులు పంపిణీ చేస్తోన్న రవి కిషన్

ఉచిత రేషన్..

అనంతరం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రవికిషన్. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ఆనందమే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యం అని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి వెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:మండలి ఏర్పాటుపై దీదీ కల ఇప్పట్లో నెరవేరేనా?

ABOUT THE AUTHOR

...view details