Google Bug Hunter: ప్రస్తుత రోజుల్లో గూగుల్ నిత్య జీవితంలో ఓ సాధనంగా మారింది. ఏది కావాలన్నా దానిని ఆశ్రయిస్తాం. అలాంటి గూగుల్ కొందరిపాలిట వరంగా అయింది. ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించే మార్గాలను సూచిస్తోంది. మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన అమన్ పాండేని మాత్రం ఏకంగా కోటీశ్వరుడ్ని చేసేసింది. ఇందుకు అతడు చేసిందల్లా గూగుల్‌లో ఉండే తప్పులను ఎత్తిచూపడమే. 300 తప్పులను కనిపెట్టినందుకు గూగుల్ సంస్థ అతనికి రూ.66 కోట్లు ఇచ్చింది.
ఉత్తరాఖండ్‌లో జన్మించిన అమన్ పాండే.. భోపాల్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. బగ్స్ మిర్రర్ అనే సంస్థను ప్రారంభించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్‌లోని 300 తప్పులను ఎత్తిచూపాడు. ఇటీవల ఇందోర్‌లో ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు. ఇందులో 15 మంది ఉద్యోగులను కూడా నియమించుకున్నాడు. 2021లో గూగుల్ నుంచి ఓ ప్రాజెక్టు కూడా చేపట్టాడు. రూ.66 కోట్లు అందుకున్నాడు. మరింత సమర్థంగా పనిచేయడానికి, తమ సంస్థను మరింత విస్తరించడానికి ఈ డబ్బును వినియోగిస్తానంటున్నాడు. ఒక్క గూగుల్ మాత్రమే కాదు యాపిల్, సామ్సంగ్ కూడా తన క్లయింట్లేనని చెప్పాడు అమన్.
"బగ్స్‌పై పనిచేసే ప్రైవేట్ కంపెనీ మాది. 2021లో ప్రారంభించాం. గుర్తు తెలియని వ్యక్తులు డేటాను హ్యాక్ చేస్తే గుర్తిస్తాం. అందుకు సొల్యూషన్ కూడా ఇస్తాం. అంతర్జాతీయ స్థాయిలో మా క్లయింట్ల కోసం పనిచేస్తాం."