తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ.. మీ నాయకత్వం భేష్.. భారత్ వేగంగా మారుతోంది'.. సుందర్ పిచాయ్ కితాబు - సుందర్ పిచాయ్ మోదీ భేటీ

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మోదీ నాయకత్వంలో భారత్​లో వేగంగా మార్పులు వస్తున్నాయని అన్నారు.

GOOGLE PICHAI MODI
GOOGLE PICHAI MODI

By

Published : Dec 19, 2022, 7:27 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దిల్లీలో కలిశారు. సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్వీట్ చేసిన సుందర్ పిచాయ్.. జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో తాము భారత్​తో కలిసి పనిచేస్తామని తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశంలో సాంకేతికపరమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు.

ప్రతిభకు చిహ్నం..
మరోవైపు, సుందర్ పిచాయ్​ను.. భారతీయుల ప్రతిభకు చిహ్నంగా అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్​లో సుందర్​తో భేటీ అయిన ముర్ము.. భారత్​లో ప్రజలందరూ డిజిటల్ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని ఆయనకు పిలుపునిచ్చారు.

రాష్ట్రపతితో సుందర్ పిచాయ్
రాష్ట్రపతితో సుందర్ పిచాయ్

'గూగుల్ ఫర్ ఇండియా' కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత్​కు వచ్చారు సుందర్ పిచాయ్. స్టార్టప్​లకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారత స్టార్టప్​లలో 300 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు గూగుల్ ఇదివరకు ప్రకటించింది. ఇందులో నాలుగో వంతు మహిళలు నాయకత్వం వహిస్తున్న స్టార్టప్​లలో పెట్టుబడులు పెట్టనుంది.

ABOUT THE AUTHOR

...view details