ఓ వ్యక్తి మరణించాడనుకుని కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపారు. అయితే వారం తరువాత ఆ వ్యక్తి సజీవంగా తిరిగి రావడం చూసి వారంతా నిర్ఘాంత పోయిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
రాజసమంద్ జిల్లాకు చెందిన ఓంకార్‌లాల్ ఈ నెల 11న కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉదయ్‌పుర్ వెళ్లారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల అక్కడే ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అదే రోజు ఆ ఆసుపత్రిలో చేరిన గోవర్ధన్ ప్రజాపత్ అనే వ్యక్తి చికిత్స తీసుకుంటూ మరణించారు. మూడు రోజులైనా గోవర్ధన్ శవాన్ని ఎవరూ గుర్తించకపోవడం వల్ల ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. చనిపోయిన వ్యక్తి ఫొటోలను వివిధ మాధ్యమాల్లో పోలీసులు ప్రచారం చేశారు.