తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Railway: దుమ్మురేపిన గూడ్సు రైళ్లు

భారతీయ రైల్వేకు(Railway) చెందిన గూడ్సు రైళ్లు దుమ్ము రేపాయి. సరకు రవాణాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక నడవాలో శనివారం మూడు రైళ్లు గంటకు 99 కి.మీ.కు పైగా వేగంతో దూసుకెళ్లాయి.

Goods train, Rajdhani
గూడ్సు రైలు

By

Published : May 30, 2021, 7:05 AM IST

Updated : May 30, 2021, 7:33 AM IST

సరకు రవాణాకు ప్రత్యేకించిన నడవా (డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌- డీఎఫ్‌సీ)లో గూడ్సు రైళ్లు(Railway) దుమ్ము రేపుతున్నాయి. శనివారం మూడు రైళ్లు గంటకు 99 కి.మీ.కు పైగా వేగంతో దూసుకెళ్లాయి. వీటిలో ఒక రైలు తూర్పు డీఎఫ్‌సీలో 99.38 కి.మీ. రికార్డును నమోదు చేసింది. అత్యంత వేగవంతమైన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (Rajdhani express) కంటే వేగంగా ఇది గమ్యాన్ని చేరింది. మునుపటి రికార్డు 97.85 కి.మీ. కాగా దానిని తోసిరాజని కొత్త రికార్డు నమోదైంది.

ఈడీఎఫ్‌సీ సరిగ్గా ఐదు నెలల క్రితం ప్రారంభమైంది. దీనిలో ఉన్న న్యూ ఖుర్జా- న్యూ భావ్‌పుర్‌ మధ్య 351 కి.మీ. దూరాన్ని ఖాళీ గూడ్సురైలు మూడు గంటల ఇరవై నిమిషాల్లో చేరుకోగలిగింది. ఇప్పటివరకు 137 రైళ్లు ఈ మార్గంలో 90 కి.మీ. పైగా వేగాన్ని సాధించినట్లు అధికారులు తెలిపారు. సాధారణ గూడ్సు రైళ్ల వేగం గంటకు 24 కిలోమీటర్లు.

ఇదీ చూడండి:రైల్వే ట్రాక్​పై దూకిన నిందితురాలు- కాపాడిన పోలీసు

Last Updated : May 30, 2021, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details