పర్యటకులకు శుభవార్త తెలిపారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా. సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవిషీల్డ్‌ను.. 16 ఐరోపా దేశాలు అధికారికంగా గుర్తించాయన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిని తమ దేశంలోకి అనుమతించేందుకు ఆయా దేశాలు అంగీకరించాయన్నారు.
అయితే ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ప్రయాణ నిబంధనలు ఉన్నందున పర్యటకులు జాగ్రత్తగా ఉండాలని పూనావాలా ట్విట్టర్ ద్వారా సూచించారు.