శాండల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth rajkumar news) మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓ గొప్ప నటుడ్ని విధి మన నుంచి దూరం చేసిందని అన్నారు. ఆయన పనిని, గొప్ప వ్యక్తిత్వాన్ని భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని మోదీ (Modi puneeth rajkumar) ట్వీట్ చేశారు. పునీత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గతంలో పునీత్‌తో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు మోదీ.
పునీత్ మరణం (Puneeth rajkumar death).. కన్నడ చిత్రసీమకు తీరని లోటు అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి.. గొప్ప నటుడు, ప్లేబ్యాక్ సింగర్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాతగా పునీత్ ఎదిగారని గుర్తుచేసుకున్నారు.
చిన్న వయసులో పునీత్ (Puneeth rajkumar age) మరణించడం బాధాకరం అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
పునీత్ ఆకస్మిక మరణం తనను వ్యక్తిగతంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. కన్నడిగుల అభిమాన హీరో అప్పూ మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పునీత్ ఇకలేరన్న బాధను తట్టుకొనే శక్తిని అభిమానులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో తెలిపారు. అంతకుముందు పునీత్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పునీత్ మరణం(Puneeth rajkumar news) వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. రాజ్‌కుమార్ కుటుంబంతో దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.