తెలంగాణ

telangana

డ్రైఫ్రూట్స్, 7కిలోల బెల్లం​ లాగించేస్తోన్న దున్నపోతు- 'గోలు-2' వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్! ధర తెలిస్తే షాక్!!​

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 8:04 AM IST

Updated : Dec 22, 2023, 11:58 AM IST

Golu 2 Buffalo Eating Dry Fruits : ఓ దున్నపోతు ప్రతిరోజు కిలోల లెక్కన డ్రైఫ్రూట్స్​, బెల్లం ఆరగిస్తోంది. లీటర్ల లెక్కన నెయ్యి, పాలు లాగించేస్తోంది. రూ.10 కోట్లు విలువైన ఆ దున్నపోతు విశేషాలు మీకోసం.

Golu 2 Buffalo Eating Dry Fruits
Golu 2 Buffalo Eating Dry Fruits

Golu 2 Buffalo Eating Dry Fruits :బిహార్​కు చెందిన ఓ దున్నపోతు రాజభోగాలు అనుభవిస్తోంది. రోజూ 35 కిలోల పచ్చి, ఎండు గడ్డి మేయడమే కాకుండా డ్రైఫ్రూట్స్​ తింటోంది. ఏడెనిమిది కిలోల బెల్లం సునాయాసంగా తినేస్తోంది. వీటిలో పాటు వెయ్యి, పాలు గటగటా తాగేస్తోంది. అలా దీని తిండి కోసం నెలకు రూ.30-35 వేల వరకు ఖర్చు అవుతోంది. అయితే ఈ దున్నపోతు యజమాని ఎందుకు ఇంతమొత్తంలో ఖర్చు పెడుతున్నాడో తెలుసుకుందాం.

జంతు ప్రదర్శనలో దున్నపోతు

ఈ దున్నపోతు ప్రత్యేకతలివే!
బిహార్​లోని పట్నాలో జరిగిన పశువుల ప్రదర్శనలో గోలు-2 అనే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరేళ్ల ఈ వయసున్న గోలు 15 క్వింటాళ్ల బరువు, 3 అడుగుల వెడల్పు ఉంది. ఈ దున్నరాజం అనేకసార్లు జాతీయ పతకాలను కూడా గెలుచుకుంది. ముర్రా జాతికి చెందిన ఈ దున్న వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ ఉంది. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఈ గోలు-2ను పట్నాలో జరిగిన జంతు ప్రదర్శనకు తీసుకొచ్చారు. దీంతో దున్న అందిరీ దృష్టిని ఆకర్షించింది. జనం ఈ దున్నను చూడటానికి బారులు తీరారు.

జంతు ప్రదర్శనలో దున్నపోతు

"పశువుల పెంపకందారుల కోసం మేము ఈ దున్నను హరియాణాలోని పానీపత్​ నుంచి తీసుకువచ్చాము. పశుపోషకులు దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి. బిహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు పశువుల పెంపకందారులకు చూపించడానికి మేము దానిని ఈ ప్రదర్శనకు తీసుకువచ్చాము. ఈ దున్న వీర్యానికి భిన్నమైన ప్రత్యేకత ఉంది. అందుకే దీని ధర ఎక్కువగా ఉంది"
-- అజిత్, పశువుల పెంపకందారు

30 వేల మంది పిల్లలు!
సాధారణ గేదెలతో బ్రీడింగ్ చేసినా దానికి పుట్టే పిల్లల జాతి కూడా మారిపోతుందని దున్నపోతు యజమాని ప్రవీణ్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ దున్నకు 30 వేల మందికి పైగా పిల్లలు ఉన్నారని అన్నారు. అయితే ఇంతకుముందు గోలు అనే దున్నపోతు ఉండేదని అది చనిపోయిన తర్వాత దీనికి గోలు-2 పేరు పెట్టినట్లు తెలిపారు. దీన్ని ముద్దుగా వాటర్​ ట్యాంకర్​ అని కూడా పిలుస్తారట.

జంతు ప్రదర్శనలో దున్నపోతు

ఈ దున్నపోతు ధర రూ.24 కోట్లు- విదేశాలకు వీర్యం!

1000 కేజీల దున్నపోతు.. బర్త్​డే వేడుకలు అదుర్స్​

Last Updated : Dec 22, 2023, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details