తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగారు ట్రీ గార్డు- బయటపెడితే ఊరుకునేదెవరు? - బంగారు కంచె చోరీ

ట్రీగార్డు.. అంటే ప్లాస్టిక్​తోనో లేదా ఇనుముతోనో చేసిందై ఉంటుంది. కానీ, ఓ చోట రూ.30 లక్షల ఖర్చు చేసి బంగారు ట్రీ గార్డును ఏర్పాటు చేశారు. దాన్ని ఆ ప్రాంతానికే గర్వకారణంగా భావించారు. అయితే.. కొన్నాళ్లకే ఆ కంచెలోని బంగారం మాయమైంది. అసలింతకీ అంత విలువైన దాన్ని అక్కడ ఎవరు? ఎందుకు ఏర్పాటు చేశారు?

Golden tree guard worth 30 lakh stolen from Jabalpur
బంగారు ట్రీగార్డు- బయటపెడితే ఊరుకునేదెవరు?

By

Published : Feb 14, 2021, 4:54 PM IST

Updated : Feb 14, 2021, 5:41 PM IST

మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మధ్యప్రదేశ్​లోని కదమ్​ అనే స్వచ్ఛంద సంస్థ​ వినూత్నంగా ఆలోచించింది. బంగారంతో ట్రీ గార్డును ఏర్పాటు చేసింది. ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరించి అర కిలో పసిడితో(దాదాపు రూ.30 లక్షలు) జబల్​పుర్​ రైల్వే స్టేషన్​ బయట.. ఈ ట్రీగార్డును నెలకొల్పింది . అయితే.. ఈ ట్రీగార్డుకు ఉండే రెండు రింగులు హఠాత్తుగా అదృశ్యమయ్యాయి.

బంగారు ట్రీ గార్డు- బయటపెడితే ఊరుకునేదెవరు?

బంగారం కంటే చెట్లే విలువైనవని ప్రజలు గ్రహించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు కదమ్​ సంస్థ సభ్యుడు యోగేశ్​ గనోరె​ తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఈ రింగుల్లో ఒకటి కనిపించకపోవడాన్ని గమనించి రైల్వే అధికారులకు లిఖిత పూర్వక సమాచారం అందించినట్లు చెప్పారు. కానీ, దీనిపై అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు.

"జబల్​పుర్​ గర్వానికి ప్రతీక ఈ ట్రీగార్డు. కదమ్​ సంస్థ ఎంతో ఖర్చు చేసి దీనిని ఏర్పాటు చేసింది. ఈ ట్రీ గార్డును సంరక్షించాల్సిన బాధ్యత రైల్వే అదికారులది. కానీ, వాళ్లు దాన్ని కాపాడలేకపోయారు. ఇప్పుడు ఈ విషయమై వారు ఏమీ చెప్పడం లేదు."

--యోగేశ్​ గనోరే, కదమ్​ సంస్థ సభ్యుడు

ప్రపంచంలోనే ఈ తరహా బంగారు ట్రీ గార్డు.. జబల్​పుర్​ మినహా మరెక్కడా లేదని కదమ్​ సంస్థ చెబుతోంది. వీటిని సంరక్షణలో రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది.

ఇదీ చదవండి:పేద ప్రజల కోసం ఒక్క రూపాయికే వైద్యం

Last Updated : Feb 14, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details