Golden Hut Restaurant: కేంద్ర ప్రభుత్వం హామీతో దిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు ముగింపు పలికిన రైతులు.. తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల మీద విజయయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో.. రైతు ఆందోళనల కారణంగా సింఘు సరిహద్దులో మూతపడ్డ గోల్డెన్ హట్ రెస్టారెంట్ తిరిగి తెరుచుకొనేందుకు సిద్ధమైంది. ఏడాదిగా రెస్టారెంట్లో.. రైతులకు లంగరు (ఉచిత భోజనశాల) ఏర్పాటుచేసి పెద్ద మనసు చాటుకున్నారు గోల్డెన్ హట్ యజమాని రాణా రాంపాల్ సింగ్. ఇందుకోసం ఆయన రోజుకు రూ. 4 లక్షలు వెచ్చించారు. ఇప్పుడు రైతులు సరిహద్దులను ఖాళీ చేస్తున్న క్రమంలో కస్టమర్ల కోసం తిరిగి తెరుచుకోనుంది.
''రైతులు నాకు కుటుంబంతో సమానం. వారి విజయం పట్ల సంతోషంగా ఉన్నా. ఒక్క రైతు ఉన్నా.. లంగరు కొనసాగుతోంది.''
- రాణా రాంపాల్ సింగ్, గోల్డెన్ హట్ యజమాని
'హెరిటేజ్ హోం'గా హౌస్ ఆన్ వీల్స్..
House on Wheels into heritage home: గాజీపుర్ సరిహద్దుల్లో రైతులు నిర్మించుకున్న హౌస్ ఆన్ వీల్స్‌ను.. 'హెరిటేజ్ హోం'గా మార్చాలని రైతులు యోచిస్తున్నారు. సుదీర్ఘ ఉద్యమానికి జ్ఞాపకంగా, రైతుల పోరాటాన్ని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకొనేలా అలాగే ఉంచనున్నారు.
ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు సులభంగా తరలించేలా 30 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పులో.. చక్రాలపై ఈ ఇంటిని నిర్మించారు. ఇటుకలు, సిమెంట్, ఐరన్, ప్లైవుడ్, గడ్డి అన్నింటినీ వాడారు. దీని కోసం రూ. 4.5 లక్షలు వెచ్చించినట్లు గుడ్డూ ప్రధాన్ అనే రైతు చెప్పుకొచ్చారు.
హౌస్ ఆన్ వీల్స్‌లో రెండు గదులు ఉంటాయి. రిఫ్రిజరేటర్, ఏసీలు, టీవీలు సహా ఎన్నో సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వంతుల వారీగా రైతులు నిరసనల సమయంలో అక్కడ నిద్రించారు.
వెనుదిరుగుతున్న రైతులు..