తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పవర్ బ్యాంక్​ 'స్క్రూ'ల ద్వారా గోల్డ్​ స్మగ్లింగ్​ - బంగారం స్మగ్లింగ్​

దుబాయ్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.18 లక్షలు విలువ చేసే బంగారాన్ని కోజికోడ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పవర్ బ్యాంక్ స్క్రూ, లగేజ్ బ్యాగ్​ స్విచ్​ల ఆకారంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.

Gold worth Rs 18 lakh seized at Kozhikode airport
పవర్ బ్యాంక్​ 'స్క్రూ' ఆకారంలో గోల్డ్​ స్మగ్లింగ్​

By

Published : Nov 27, 2020, 6:04 PM IST

కేరళ కోజికోడ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్​ అధికారులు. దుబాయ్​ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.18 లక్షలు విలువ చేసే పసిడిని స్వాధీనం చేసుకున్నారు. పవర్​ బ్యాంక్ 'స్క్రూ'లు, లగేజ్​ బ్యాగ్ స్విచ్​ల ఆకారంలో బంగారాన్ని వీరు అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి గుట్టు రట్టు చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మరో వ్యక్తి 'క్యాప్సుల్స్​' ఆకారంలో

దుబాయ్​ నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి 463 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. మూడు క్యాప్సుల్స్​ ఆకారంలో ఉన్న పసిడిని అతని వద్ద గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆ రెండు టీకాల్ని కలిపితే మెరుగైన ఫలితం!'

ABOUT THE AUTHOR

...view details