Gold Theft News: బంగారం కొనడానికి అంటూ వచ్చిన ముగ్గురు మహిళలు ఆ దుకాణం యజమాని కళ్లుగప్పి రూ. 4.5 లక్షలు విలువ చేసే బంగారం బాక్స్ కొట్టేశారు. మహారాష్ట్ర నాసిక్‌లో బుధవారం జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
Gold Theft News: బంగారం కొనడానికి అంటూ వచ్చిన ముగ్గురు మహిళలు ఆ దుకాణం యజమాని కళ్లుగప్పి రూ. 4.5 లక్షలు విలువ చేసే బంగారం బాక్స్ కొట్టేశారు. మహారాష్ట్ర నాసిక్‌లో బుధవారం జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
సరాఫ్ బజార్‌లోని ఓ బంగారం దుకాణానికి చిన్న పిల్లతో కలిసి ముగ్గురు మహిళలు వచ్చారు. ఆ నగ చూపించండి, ఈ ఆభరణం ధరెంత అంటూ హడావుడి చేసి.. షాప్ యజమానిని కన్ఫ్యూజ్ చేసేశారు. అప్పుడే ఆయనకు ఫోన్ కాల్ రాగా వారి పని మరింత సులువైంది. పట్టపగలే, షాప్ ఓనర్ ఎదుటే.. రూ.4.5 లక్షల బంగారు ఆభరణం పెట్టెను ఖతర్నాక్‌గా కొట్టేసింది ఓ మహిళ. తనతో వచ్చిన చిన్న పిల్లకు ఇచ్చి, బయటకు పంపేసింది. తర్వాత ఎప్పుడో సీసీటీవీ కెమెరా దృశ్యాలు చూశాక చోరీ జరిగిందని యజమానికి అర్థమైంది. ఆయన ఫిర్యాదు మేరకు సర్కార్వాడా ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి :మంకీ ఫీవర్ కలకలం- ఆ రాష్ట్రంలో తొలికేసు