తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒంట్లో బంగారం ముద్దలు.. కొరియర్ బ్యాగ్​లో 5.3 కోట్ల హెరాయిన్ - అక్రమంగా బంగారం తరలింపు

Gold Smuggling In Karnataka: మాదక ద్రవ్యాలను, బంగారాన్ని అక్రమంగా తరలించడానికి వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు దుండగులు. బంగారం ముద్దలను శరీరంలో దాచుకున్న ఓ వ్యక్తిని కర్ణాటకలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మరో ఘటనలో దుబాయ్​ నుంచి కొరియర్​లో వచ్చిన రూ.5.3 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

heroin seized
హెరాయిన్

By

Published : Jan 27, 2022, 9:56 AM IST

Gold Smuggling In Karnataka: కర్ణాటకలో బంగారం ముద్దలను శరీరంలో దాచుకుని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

584 గ్రాముల బంగారాన్ని కోడిగుడ్డు రూపంలో ముద్దలుగా మార్చి శరీరంలో దాచుకుని దుబాయ్​ నుంచి వస్తున్న ప్రయాణికున్ని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 29 లక్షలు ఉంటుందని తెలిపారు.

తరలిస్తున్న బంగారం..

5.3 కోట్ల హెరాయిన్​..

Heroin Seized in Karnataka: కొరియర్​లో అక్రమంగా తరలిస్తున్న 754 గ్రాముల హెరాయిన్​ను దేవనహళ్లి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.5.3 కోట్లు ఉంటుందని తెలిపారు.

హెరాయిన్​

డాక్యుమెంట్స్​తో కూడిన బ్యాగ్​.. కొరియర్​లో దుబాయ్​ నుంచి విమానాశ్రయానికి వచ్చింది. దానిని అధికారులు తనిఖీ చేయగా.. బ్యాగ్​లో పేపర్ల మధ్య హెరాయిన్ పౌడర్​ బయటపడింది. కేసు నమోదు చేసుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

కొరియర్​లో హెరాయిన్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:విద్యార్థినిపై ఇద్దరు సహచర బాలురు అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details