కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం Gold Smuggling In Coffee Bottle: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 3.8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కెన్యా నుంచి వచ్చిన 18 మంది మహిళలను అధికారులు తనిఖీ చేయగా వారి వద్ద ఈ అక్రమ బంగారం బయటపడింది.
కాఫీ బాటిళ్లలో..
స్వాధీనం చేసకున్న బంగారం విలువ కోట్లలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాఫీ బాటిళ్లు, మసాలా సీసాలు, లోదుస్తులు, చెప్పులు తదితర వాటిలో బంగారాన్ని దాచి తరలించేందుకు.. మహిళలు ప్రయత్నించినట్లు చెప్పారు. పట్టుబడిన బంగారం.. బార్లు, తీగలు, పౌడర్ రూపంలో ఉన్నట్లు వివరించారు.
కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం ఈ ఘటనకు సంబంధించి ఓ కెన్యా మహిళను అరెస్టు చేశామన్నారు. మిగతావారిని విచారణ తర్వాత వదిలిపెట్టినట్లు తెలిపారు. ఇదే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఇదీ చూడండి:వానరం ప్రేమ.. కుక్కపిల్లను ఎత్తుకుని తిరుగుతూ...