తెలంగాణ

telangana

Gold Man Of Bihar : బంగారు కళ్లద్దాలు, మొబైల్​ కవర్​.. ఐదు కిలోల అభరణాలతో వావ్​ అనిపిస్తున్న బిహార్​ గోల్డ్ మ్యాన్​

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 12:51 PM IST

Gold Man Of Bihar : శరీరంపై మూడో నాలుగో బంగారు గొలుసులు అలంకరించుకునే వారిని మనం చూస్తుంటాం. కానీ ఏకంగా మెడలో 30కి పైగా గొలుసులు, రెండు చేతులకు కలిపి 10 ఉంగరాలు ధరించే వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?. అవునండి బిహార్​కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 5 కేజీల 200 గ్రాముల నగలను తన ఒంటిపై వేసుకుంటున్నారు. ఆయన గురించి మరిన్ని వివరాలు మీకోసం.

Gold Man Of Bihar
Gold Man Of Bihar

Gold Man Of Bihar : బంగారం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎక్కువగా మహిళలు పసిడి అభరణాలు ధరించడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ దీనికి భిన్నంగా బిహార్​కు చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి మాత్రం తన మెడలో 30కి పైగా గొలుసులు, చేతి వేళ్లకు పది ఉంగరాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన ఎక్కడకి వెళ్లినా 5 కేజీల 200 గ్రాముల బరువున్న ఈ అభరణాలు ధరించే వెళ్తారు. మరి బిహార్​ గోల్డ్​ మ్యాన్ కథ గురించి ఓ సారి తెలుసుకుందామా?

ఆసక్తి..అభిరుచిగా మారి
భోజ్​పుర్​కు చెందిన ప్రేమ్​సింగ్​కు చిన్ననాటి నుంచే బంగారం అంటే ఆసక్తి. ఆయనకు ఉన్న ఈ అభిరుచి క్రమంగా మరింత ఎక్కువై ప్రస్తుతం 5 కేజీల 200 గ్రాముల బంగారాన్ని తన శరీరంపై అలంకరించుకొనేలా చేసింది. ప్రేమ్​సింగ్ ప్రస్తుతం వాడుతున్న కళ్లద్దాలు, మొబైల్​ కవర్ ఇలా చాలా వస్తువులు బంగారంతో చేసినవే కావడం విశేషం. ఈ ఒక్క విషయం చాలు ఆయనను పసిడి అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి.

గోల్డ్ మ్యాన్ ప్రేమ్ సింగ్

"నేను ఓ భూస్వామి కుటుంబంలో పుట్టాను. ప్రస్తుతం కాంట్రాక్టర్​గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి బంగారం అంటే ఆసక్తి. ప్రస్తుతం కాంట్రాక్టర్​గా పనిచేస్తున్నా. అందులో వచ్చిన ఆదాయంతో పసిడి అభరణాలు కొనుగోలు చేస్తున్నా. నా వద్ద 2022 వరకూ రెండు కిలోలు బంగారం మాత్రమే ఉండేది. పసిడి ధరించాలనే ఆసక్తి క్రమంగా మరింత పెరిగింది. ప్రస్తుతం నా వద్ద 5 కేజీల 200 గ్రాముల బంగారు అభరణాలు ఉన్నాయి. గోల్డ్​ మ్యాన్​ ఆఫ్ ఇండియాగా అవతరించాలన్నదే నా లక్ష్యం. నేను వివిధ కార్యక్రమాలకు వెళ్లినపుడు ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అప్పుడు ఆనందంగా ఉంది. "
-ప్రేమ్​సింగ్​ , గోల్డ్​మ్యాన్​

భద్రతాపరమైన ఇబ్బందులేం లేవు
5 కేజీల 200 గ్రాముల బంగారు అభరణాలు ధరించి వెళ్లినపుడు తనకు ఎటువంటి భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవ్వలేదని ప్రేమ్​ సింగ్ తెలిపారు. బయటకు వెళ్లినపుడు తనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారని.. వారే తన భద్రతను చూసుకుంటారని చెప్పారు. పసిడి వస్తువులకు సంబంధించి అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని ప్రేమ్ సింగ్​ వెల్లడించారు.

బిహార్ గోల్డ్ మ్యాన్ ప్రేమ్​ సింగ్​
చేతి వేళ్లకు ఉంగరాలతో గోల్డ్ మ్యాన్

ఆ 'గోల్డ్​ మ్యాన్'​ మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Congress Manifesto In Madhya Pradesh : రూ.25లక్షలు ఆరోగ్య బీమా.. OBCలకు 27% రిజర్వేషన్.. రాష్ట్రానికి IPL​ టీం!

ABOUT THE AUTHOR

...view details