ఉత్తర్‌ప్రదేశ్‌లోని అదానీ లఖ్‌నవూ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బంగారం పెట్టె ఒకటి బయటపడింది. దీంట్లో రూ.కోటి 88 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. ఈ బంగారం ఎవరిది అన్న కోణంలో విచారణ చేపట్టింది.
దుబాయ్ నుంచి లఖ్‌నవూకు చేరుకున్న విమానం లోపల ఒక పెట్టెను విమానాశ్రయ సిబ్బంది కనుగొన్నారు. దీనిలో 3.84 గ్రాముల బరువైన 33 బంగారు బిస్కెట్లున్నాయి.
-డిప్యూటీ కమిషనర్ నిహారికా లఖా
స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో స్మగ్లర్ ఉండొచ్చని.. అయితే కస్టమ్స్ తనిఖీల కారణంగా బంగారాన్ని బయటకు తీయలేకపోయినట్లు భావిస్తున్నారు.