కొవిడ్ కట్టడి, టీకా పంపిణీ విషయంలో మోదీ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18-45 మధ్య వయస్కుల వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వకపోవడానికి కారణమేంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మధ్యవర్తుల కారణంగా వాక్సిన్ ధరలకు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. పేదలకు వ్యాక్సిన్ ఇవ్వడంపై స్పష్టత ఏదని అన్నారు. కేంద్రానిది వివక్షపూరిత టీకా విధానమని ట్వీట్ చేశారు రాహుల్.
ఎన్నికలపైనే మక్కువా?