తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​కు సమాచారం చేరవేత- మాజీ సైనికుడు అరెస్ట్​!

అనస్​ గితేలీ అనే మాజీ సైనికుడిని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు అరెస్టు చేశారు. సైనిక సమాచారాన్ని పాకిస్థాన్​కు అందిస్తున్నాడనే కారణంతో ఈ చర్య చేపట్టారు. ​

godra, up police
మాజీ సైనికుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

By

Published : Jan 8, 2021, 9:57 PM IST

Updated : Jan 8, 2021, 10:04 PM IST

గోద్రా ప్రత్యేక కార్యదళం సహకారంతో ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు మాజీ సైనికుడిని శుక్రవారం అరెస్టు చేశారు. గుజరాత్​లోని గోద్రాలో నివసిస్తున్న అనస్ గితేలీ.. భారత సైన్యం వివరాలను పాకిస్థాన్​కు చేరవేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

నిందితుడు గితేలీ

గితేలీని లఖ్​నవూకు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో అతని ఖాతాలోకి కొంత డబ్బు డిపాజిట్​ అయిందని వెల్లడైంది. గతేడాది సెప్టెంబరులో అనస్ గితేలీ సోదరుడు ఇమ్రాన్​ గితేలీను (జాతీయ భద్రతా సంస్థ) ఎన్​ఐఏ అరెస్టు చేసింది. నేవీ రహస్యాలను పాక్​కు చేరవేసేందుకు యత్నించడమే కారణం.

ఇదీ చూడండి :టీకా రవాణాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Last Updated : Jan 8, 2021, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details