బంగాల్ కోల్కతాకు చెందిన నజ్రుల్ పార్క్ ఉన్నాయన్ సమితి దుర్గా పూజ నిర్వాహకులు.. ఈసారి వినూత్నంగా దుర్గాదేవి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. అందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలికలతో దుర్గామాత విగ్రహాన్ని తయారుచేశారు. అంతేకాక దీదీ వస్త్రధారణ దృష్టిలో ఉంచుకుని విగ్రహానికి తెల్లచీర, సాధారణ చెప్పులను తయారుచేస్తున్నారు. విగ్రహం వెనుక 'బిశ్వ బంగ్లా' అనే లోగోను ఏర్పాటు చేయనున్నారు.
ఈ విగ్రహానికి రూ. 2.10లక్షలు ఖర్చు అయిందని క్రౌడ్ఎన్ఎక్స్టీ మీడియా ఆర్ట్ డైరెక్టర్ దీపన్వితా బాగ్చీ తెలిపారు. దీదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిబింబించేలా 10 చేతులను కూడా విగ్రహానికి అమర్చనున్నట్లు వివరించారు.