తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడికి వెళ్తూ ఏడుగురు మృతి.. ఆ సరస్సులో దిగడమే వారి తప్పు! - ఉనా న్యూస్

సరస్సులో మునిగి ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు బయటపడ్డారు. ఈ ఘటన హిమాచల్​ప్రదేశ్​లోని ఉనాలో జరిగింది.

Gobind Sagar Lake Accident
సరస్సులో మునిగి ఏడుగురు మృతి

By

Published : Aug 2, 2022, 9:40 AM IST

Updated : Aug 2, 2022, 10:39 AM IST

హిమాచల్​ప్రదేశ్​లోని ఉనా జిల్లాలో దారుణం జరిగింది. కోల్కా గ్రామంలోని గోవింద్ సాగర్ సరస్సులో మునిగి ఏడుగురు యువకులు మరణించారు. మరో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఏడు మృతదేహాలను పోలీసులు శవపరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతులందరూ పంజాబ్​.. మొహలీ సమీపంలోని బనూడ్ గ్రామానికి చెందినవారు. ఉనా జిల్లాలోని నైనా దేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే.. గుడికి వెళ్లే ముందు గోవింద్ సాగర్ సరస్సులో స్నానం చేయాలని అనుకున్నారు. నీటిలో దిగిన 11 మందిలో నలుగురు ప్రాణాలతో బయటపడగా.. మిగతా ఏడుగురు దురదృష్టవశాత్తూ చనిపోయారు. శవపరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

యువకుల మృతితో వారి స్వగ్రామం బనూడ్​లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరందరూ పేద కుటుంబాలకు చెందినవారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్ బాదల్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్​ సింగ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇవీ చదవండి:'ఆమె' నుంచి నగ్నంగా వీడియో కాల్.. ఇంజినీర్​కు రూ.25లక్షలు లాస్!

ప్రముఖ ప్రొడ్యూసర్​ ఇంటిపై ఐటీ దాడులు.. ఆ స్టార్ హీరో​తో లింకులు!

Last Updated : Aug 2, 2022, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details