తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ నేతకు జీవితకాలం కేబినెట్​ హోదా ఇస్తున్న భాజపా సర్కార్! - గోవా ఎన్నికలు 2022

Life Long Cabinet Status: గోవా మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ప్రతాప్​ సింగ్​ రాణేకు జీవితకాల కేబినెట్​ హోదాను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ ప్రకటనపై ఆయన కుమారుడు, భాజపా ఎమ్మెల్యే విశ్వజిత్​ రాణే హర్షం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల పాటు ప్రజాసేవ చేసిన ఓ వ్యక్తిని ఇంతకంటే ఘనంగా గౌరవించలేమని పేర్కొన్నారు.

Life Long Cabinet Status
ప్రతాప్​ సింగ్​ రాణే

By

Published : Jan 7, 2022, 4:11 PM IST

Life Long Cabinet Status: గోవా కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎమ్మెల్యే ప్రతాప్ ​సింగ్​ రాణేకు జీవితకాలం కేబినెట్​ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ గురువారం వెల్లడించారు. రాష్ట్రానికి ప్రతాప్ ​సింగ్​ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ హోదా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

"గోవా రాష్ట్రానికి విశేష సేవలు అందించిన ప్రతాప్​ సింగ్​ రాణేకు జీవితకాలం కేబినెట్​ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 50 ఏళ్లగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న ప్రతాప్​.. ముఖ్యమంత్రిగా, స్పీకర్​గా సేవలు అందించారు. ప్రతాప్​ సింగ్​ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

-ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి

జీవితకాలం కేబినెట్​ హోదా ద్వారా రాణేకు ఓ మంత్రికి అందే గౌరవం, అన్ని సౌకర్యాలు లభించనున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేందుకే!

ప్రతాప్ సింగ్.. దశాబ్దాలుగా కాంగ్రెస్​లోనే ఉన్నారు. ఆయన కుమారుడు విశ్వజిత్ రాణే ప్రస్తుతం భాజపా శాసనసభ్యుడు.

కాంగ్రెస్​ తరఫున రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రతాప్ సింగ్ ఇటీవల ప్రకటించారు. శ్రేయోభిలాషులు, మద్దతుదార్ల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రతాప్​సింగ్​ ప్రకటనను ఆయన కుమారుడు విశ్వజిత్​ రాణే తప్పుబట్టారు.

"83 ఏళ్ల వయసులో ఆయన ఇంకా రాజకీయాల్లో కొనసాగడం ఎందుకు? ఆరు టర్ములకుపైగా ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. నేను ఆదర్శంగా భావించే వ్యక్తి రాజకీయాల్లో ఓటమి పాలై పదవీ విరమణ పొందడం సరికాదు. నేను పొరియమ్​ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయం. ఆయన పోటీ చేయడంపై మేము మరోసారి చర్చించుకుంటాం."

-విశ్వజిత్​ రాణే, ప్రతాప్​సింగ్​ కుమారుడు

ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్​ ప్రతాప్ ​సింగ్​ను పొరియం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ప్రతాప్​ సింగ్​ ఉన్నట్లుండి యూటర్న్​ తీసుకున్నారు. పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భాజపా ప్రభుత్వం ఆయనకు జీవితకాల కేబినెట్​ హోదా ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

విశ్వజిత్ హర్షం..

ముఖ్యమంత్రి ప్రకటనపై విశ్వజిత్​ రాణే హర్షం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల పాటు ప్రజాసేవ చేసిన ఓ వ్యక్తిని ఇంతకంటే ఘనంగా గౌరవించలేమని పేర్కొన్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

రాణే రికార్డు..

ప్రతాప్​ సింగ్​ రాణే.. గత 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. 10 సార్లు శానససభ్యుడిగా గెలుపొంది​.. గోవాకు సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఎమ్మెల్యేగా ఘనత పొందారు. తొలిసారిగా 1972లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980-2007 మధ్య ఆరుసార్లు ముఖ్యమంత్రిగా(16 ఏళ్లు) బాధ్యతలు చేపట్టిన రాణే.. 2007-2012 మధ్య అసెంబ్లీ స్పీకర్​గా సేవలు అందించారు.

ఇదీ చూడండి :ఫోన్​ తెచ్చిందని దుస్తులు విప్పించి.. నేలపై కూర్చోబెట్టిన హెడ్​మాస్టర్​

ABOUT THE AUTHOR

...view details