Goa Election 2022: సాగర తీరం.. పర్యటక రాష్ట్రమైన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 40 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 301 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
కరోనా వేళ ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేలా.. రాష్ట్రంలో 100కు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అధికారం నిలబెట్టుకోవాలని భాజపా చూస్తుండగా.. గోవాలో మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. అటు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ సైతం గోవాలో విజయం సాధించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలవాలని ఎన్సీపీ- శివసేన కూటమి భావిస్తోంది.