Goa Congress candidates pledge: 'జంప్ జిలానీ'ల భయంతో గోవా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. గత అయిదేళ్లుగా భాజపా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులతో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ... వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో బరిలో నిలవనున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించింది. తాము గెలిస్తే పార్టీ మారమని భగవంతునిపై ఒట్టు వేయించింది.
ఇందుకోసం ఎన్నికల బరిలోకి దిగనున్న మొత్తం 34 మంది అభ్యర్థులను ప్రత్యేక బస్లో రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు, చర్చ్లకు, దర్గాలకు తీసుకుని వెళ్లి.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడమని దేవుని ఎదుట ప్రమాణం చేయించారు కాంగ్రెస్ పెద్దలు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న సీనియర్ నాయకుడు చిదంబరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అభ్యర్థులతో ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్ పార్టీ వాదన మరోలా ఉంది. ప్రజల మనసుల్లో నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇలా దేవుని ముందు ప్రమాణం చేయించినట్లు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ చెప్పారు.
గోవాలో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అత్యధికంగా 17 సీట్లలో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఒక్కొక్కరు పార్టీని వీడగా.. ప్రస్తుతం వారి సంఖ్య ఇద్దరికి పరిమితం అయ్యింది. 2019లో ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార భాజపాలో చేరారు. దీంతో భాజపా బలం 27కు చేరింది.
కొత్తేం కాదు..