తెలంగాణ

telangana

By

Published : Aug 15, 2021, 5:53 AM IST

ETV Bharat / bharat

'జెండా ఆవిష్కరణ వద్దన్న స్థానికులు- ఎగరేసిన నౌకాదళం!'

గోవాలోని సావో జాసింటో ఐలాండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణకు స్థానికులు వ్యతిరేకించగా.. సీఎం ప్రమోద్​ సావంత్​ విజ్ఞప్తితో జెండాను ఆవిష్కరించింది నౌకాదళం. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున సావో జాసింటో కచ్చితంగా జాతీయ జెండాను ఎగరేస్తామని ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు.

Unfurl National Flag on the Sao Jacinto island in Goa
సావో జాసింటోలో జెండా ఆవిష్కరించిన నేవీ అధికారులు

గోవా సీఎం ప్రమోద్​ సావంత్​ విజ్ఞప్తితో సావో జాసింటో ఐలాండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించింది నౌకాదళం. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున సావో జాసింటో కచ్చితంగా జాతీయ జెండాను ఎగరేస్తామని ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు.

ఇటీవల కొంత మంది ఐలాండ్‌ వాసులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ అధికారులను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా నౌకాదళ అధికారులను ఆయన అభ్యర్థించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

ఏం జరిగిందంటే..?

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఆజాది కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ఆగస్టు 13-15 మధ్య దేశవ్యాప్తంగా ఉన్న ద్వీపాలలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక బృందం సావో జసింటోతో సహా రాష్ట్రంలోని ద్వీపాలను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే సావో జసింటో ద్వీపంలోని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ జెండావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ముందుగా నౌకాదళ అధికారులు భావించారు. అయితే, ఐలాండ్‌లో నివాసం ఉండే తాము జెండా ఆవిష్కరణకు వ్యతిరేకం కాదని, మేజర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్లు కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటుందేమోనని భయపడ్డామని తెలిపారు.

అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం..

జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నౌకాదళం ప్రకటించగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ట్విటర్‌ ద్వారా స్పందించారు. "సావో జాసింటో ఐలాండ్‌లోని కొంతమంది వ్యక్తులు జాతీయ జెండాను ఎగురవేయడాన్ని వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటు. దీనిని నేను ఖండిస్తున్నాను. అలాంటి చర్యలను ఏమాత్రం సహించను. నావికాదళం అధికారులు అక్కడ కచ్చితంగా జెండా ఆవిష్కరణ జరపాలి. గోవా పోలీసుల నుంచి వారికి పూర్తి సహకారం అందిస్తాం" అని ట్విటర్‌లో పోస్టు చేశారు.

ఇదీ చూడండి:'కరోనా ఇంకా అంతం కాలేదు'

ABOUT THE AUTHOR

...view details