Pramod Sawant Goa CM: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో గవర్నర్ చేతుల మీదుగా వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. గోవాకు రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడవ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ చరిత్ర సృష్టించారు. 2019లో మొదటిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం.. వరుసగా రెండోసారి - bjp in goa
Pramod Sawant Goa CM: గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో గవర్నర్ సమక్షంలో వరుసగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం
40 స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలో భాజపా పార్టీ 20 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎంజీపీ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు పలకగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి:కాంగ్రెస్ వ్యూహకర్తగా మళ్లీ పీకే.. ఆ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలు అప్పగింత!