తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గురువారం నుంచి గోవాలో లాక్​డౌన్​ - గోవా లాక్​డౌన్​

కరోనా కట్టడికి గోవా ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. ఏప్రిల్​ 29 నుంచి మే 3 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఎం ప్రమోద్​ సావంత్​ ప్రకటించారు.

Goa announces lockdown, lockdown
గోవా లాక్​డౌన్​

By

Published : Apr 28, 2021, 2:12 PM IST

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్​డౌన్ విధిస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఏప్రిల్​ 29 రాత్రి 7 గంటల నుంచి మే 3 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నిత్యావసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలకు లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఇచ్చారు.

ప్రజా రవాణా, కాసినోలు, హోటళ్లు, పబ్బులు పూర్తిగా మూసివేస్తున్నట్లు సావంత్ తెలిపారు. నిత్యవసర సేవల రవాణాకు మాత్రమే సరిహద్దులు తెరిచి ఉంటాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details