గోవాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల వ్యవధిలో 26 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ సరఫరాలో చోటుచేసుకున్న జాప్యమే మరణాలకు కారణమని తెలుస్తోంది. తాజా ఘటనపై స్వయంగా దర్యాప్తు జరిపించాలని హైకోర్టును గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె కోరారు. గోవా వైద్య కళాశాల ఆసుపత్రి (జీఎంసీహెచ్)లో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్య 26 మంది కరోనా బాధితులు మృత్యువాతపడిన సంగతి వాస్తవమని రాణె తెలిపారు. మరణాలకు కారణం మాత్రం స్పష్టంగా తెలియదని చెప్పారు. ఆసుపత్రికి ప్రాణవాయువు సరఫరాలో కొన్ని లోటుపాట్లు ఉన్న సంగతి నిజమేనని ఆయన అంగీకరించారు.
కొవిడ్ రోగుల మృతి వార్త తెలియగానే జీఎంసీహెచ్‌ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సందర్శించారు. కరోనా వార్డులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో చోటుచేసుకున్న జాప్యమే తాజా దారుణానికి కారణమయ్యుండొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాణవాయువు, సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. అయితే- లక్షిత ప్రాంతాలకు సిలిండర్లు సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఆక్సిజన్ ట్యాంక్ లీక్