తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానం కిందకు దూసుకెళ్లిన కారు.. ముందు చక్రాల వరకు వెళ్లి...

Car goes under plane: దిల్లీ విమానాశ్రయంలో అనూహ్య ఘటన జరిగింది. ఎయిర్​పోర్ట్​లో నిలిపి ఉంచిన ఓ విమానం కిందకు కారు దూసుకెళ్లింది. విమానం ముందు చక్రాల వరకు కారు వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

GOFIRST CAR
GOFIRST CAR

By

Published : Aug 2, 2022, 2:14 PM IST

Updated : Aug 2, 2022, 2:26 PM IST

Car goes under IndiGo plane: దేశంలోని విమానయాన సంస్థలు రోజుకో సమస్యలతో వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ విమానం వార్తల్లోకెక్కింది. గోఫస్ట్ ఎయిర్​లైన్​కు చెందిన ఓ కారు.. ఇండిగో ఏ320నియో విమానం కిందకు వెళ్లింది. విమానం ముందు చక్రాల ముందు ఆగింది. త్రుటిలో విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ ఎయిర్​పోర్ట్ టీ2 టెర్మినల్​లోని 201వ స్టాండ్​లో ఈ ఘటన జరిగింది. దీనిపై డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది.

విమానం మంగళవారం ఉదయం దిల్లీ నుంచి పట్నాకు బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్విఫ్ట్ డిజైర్ కారు దూసుకొచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. విమానానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశాయి. ఘటన అనంతరం విమానం యథాతథంగా ప్రయాణం సాగించిందని, షెడ్యూల్ ప్రకారమే బయల్దేరిందని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై డీజీసీఏ రంగంలోకి దిగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.

Indigo plane skids off runway:ఇటీవలే ఇండిగో విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. అసోం జోర్హాట్​ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అవుతుండగా రన్‌వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను క్షేమంగా కిందకు దించేశారు. అయితే ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు. వారిని మరో విమానంలో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

కొంతకాలంగా పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయటపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ చర్యలు చేపట్టింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న నిపుణులైన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. 8 వారాల పాటు స్పైస్‌జెట్‌ విమానాలను 50 శాతం మాత్రమే నడపాలని ఆంక్షలు విధించింది.

Last Updated : Aug 2, 2022, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details