అంతర్జాతీయ పేమెంట్ కార్డుల నెట్‌వర్క్‌లైన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌లపై రిజర్వు బ్యాంక్ కొరడా ఝులిపించింది. పేమెంట్ వ్యవస్థ సమాచారాన్ని నిల్వ చేయడంలో సరైన నిబంధనలు పాటించని కారణంగా.. ఈ రెండు సంస్థలపై ఆంక్షలు విధించింది. మే 1నుంచి కొత్త వినియోగదారులను చేర్చుకోకూడదని ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఉన్న వినియోగదారులపై ఈ ఆంక్షలతో ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.
అమెరికన్ నెట్వర్క్, డైనర్స్ క్లబ్‌పై ఆర్బీఐ కొరడా - ఆర్బీఐ ఆంక్షలు అమెరికన్ ఎక్స్‌ప్రెస్
మే 1 నుంచి కొత్త వినియోగదారులను చేర్చుకోకుండా కార్డ్ ఆపరేటర్లైన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌లపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేయడంలో నిబంధనలు పాటించనందుకు ఈ చర్యలు తీసుకుంది.

ప్రముఖ పేమెంట్ ఆపరేటర్లపై ఆర్బీఐ కొరడా
ఆర్బీఐ నిబంధనల ప్రకారం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు.. తమ వినియోగదారుల పూర్తి సమాచారాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంబంధిత వ్యవస్థలో నిక్షిప్తం చేయాలి. ఈ వ్యవస్థలు భారత్‌లోనే ఉండాలి. దీంతో పాటు ఈ సమాచారాన్ని ఆర్బీఐతో పంచుకోవాలి. కంపెనీ బోర్డు ఆమోదించిన ఆడిట్ రిపోర్టును ఆర్బీఐకి సమర్పించాలి.
ఇదీ చదవండి-సెప్టెంబరు కల్లా కొవావ్యాక్స్ టీకా!