తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచుపెళ్లలు - చమోలీలో విరిగిపడ్డ హిమానీనదం

భారత్​-చైనా సరిహద్దుల్లో ఉండే సుమ్నా రహదారిపై మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించారు.

Glacier breaks, ice
భారత్​-చైనా సరిహద్దుల్లో విరిగిపడ్డ హిమానీనదం

By

Published : Apr 24, 2021, 5:35 AM IST

ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లా నీతీ లోయకు సమీపంలో శుక్రవారం మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. దట్టంగా మంచు కురుస్తుండటంతో ఆ ప్రాంతం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) తెలిపింది. తమ కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనిచేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

ఓ బృందం అక్కడికి చేరుకున్నప్పటికీ నష్టానికి సంబంధించిన సమాచారమేదీ లేదని తెలిపారు. ఈ ఘటనపై అందరినీ అప్రమత్తం చేసినట్లు ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ ట్విటర్‌లో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛమోలీలోనే భారీగా మంచుపెళ్లలు విరిగిపడిన ఘోర విపత్తులో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

నీతి వ్యాలీలో మూడు రోజులుగా హిమపాతం భారీగా పడుతోంది. దీంతో జోషిమఠ్​-మలారి రహదారి మంచులో కూరుకుపోయింది. ఆర్మీ, ఐటీబీపీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి:8 రోజుల్లోనే వంతెన పునర్నిర్మించి బీఆర్​ఓ రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details