తెలంగాణ

telangana

ETV Bharat / bharat

' ప్రేమ పెళ్లిళ్లు అమ్మాయిలకు ప్రమాదకరం'

Bihar dgp about love marriages: ప్రేమ పెళ్లికోసం ఇళ్లను వీడి వెళ్తున్న అమ్మాయిల్లో చాలా మంది హత్యకు గురవుతున్నారని బిహార్ డీజీపీ ఎస్​కే సింఘాల్ తెలిపారు. మరికొంతమంది బలవంతంగా వ్యభిచారంలోకి వెళ్తున్నారని చెప్పారు.

bihar dgp on love marriges
బిహార్ డీజీపీ

By

Published : Dec 31, 2021, 9:53 PM IST

Bihar dgp about love marriages: బిహార్​ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్​(డీజీపీ) ఎస్​కే సింఘాల్ గురువారం షాకింగ్ విషయాలు చెప్పారు. ప్రేమ పెళ్లికోసం ఇంటిని వీడి వెళ్తున్న అమ్మాయిలు.. బలవంతంగా వ్యభిచార ముఠాలోకి వెళ్తున్నారని అన్నారు. సమస్తీపుర్​లో నిర్వహించిన 'సమాజ్ సుధార్ అభియాన్​' వేదికగా గురువారం ఆయన మాట్లాడారు.

"తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి కోసం ఇంటిని వీడి వెళ్తున్న సంఘటనలను మనం చూస్తున్నాం. అయితే... వారిలో చాలా మంది హత్యకు గురువుతున్నారు. మరికొంతమంది బలవంతంగా వ్యభిచారంలోకి చేరుతున్నారు. వీటికి తల్లిదండ్రులే మూల్యం చెల్లించుకుంటున్నారు."

-ఎస్​కే సింఘాల్​, బిహార్ డీజీపీ.

తల్లిదండ్రులు తమ పిల్లలో తరుచూ మాట్లాడాలని సింఘాల్ కోరారు. వారికి మంచి విలువలు బోధించాలని.. వారి ఫీలింగ్స్​ను అర్థం చేసుకోవాలని సూచించారు.

అల్కాహాల్ డీఅడిక్షన్, వరకట్న నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం వంటి సామాజిక సంస్కరణల కోసం... 'సమాజ్ సుధార్ అభియాన్' పేరుతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి:భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య

ఇదీ చూడండి:'ఆత్మలతో మాట్లాడటం' కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయిన మైనర్​!

ABOUT THE AUTHOR

...view details