Girlfriend Revenge on Ex Boyfriend for Putting Ganja in Car : గత చరిత్రను చూస్తే ప్రేమ కోసం ప్రాణాలనే త్యాగం చేసిన ప్రేమికులను చూశాము. అలాంటి వారిలో లైలా మజ్నూ, పారూదేవదాస్ వంటి జంటలు ముందువరుసలో నిలుస్తాయి. మరికొంత మంది ప్రేమికులు అనేక కారణాలతో విడిపోయినా ఎవరి జీవితం వారు ప్రశాంతంగా గడుపుతున్నారు. అలా రోజులు మారుతున్న కొలదీ ఇప్పుడు ప్రేమ అంటే డబ్బు, ఆ క్షణం సుఖం కోసం వెపర్లాడే ప్రేమ జంటలే ఎక్కువ.
ఈ మధ్యకాలంలో ప్రేమికులు విడిపోతే ప్రియుడు, ప్రియురాలిని వారు ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫొటోలను చూపించి బెదిరించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా ప్రియురాలే మాజీ ప్రియుడిపై పగతో గంజాయి కేసులో ఇరికించి పోలీసులకు పట్టించింది. ఈ కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసి, చివరికి ఆమెనే అరెస్టు చేశారు. ప్రేమ బంధానికే బీటలు బారేలా చేసిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.
జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే హైదరాబాద్ రెహమత్ నగర్‌కు చెందిన రింకీ అనే యువతి, సరూర్‌నగర్‌కు చెందిన శ్రవణ్ ఒకే ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు యువతీయువకుడు కలిసి తిరగ్గా రింకీ ప్రవర్తన నచ్చక శ్రవణ్ ఆమెను దూరం పెట్టాడు. తనను కాదన్నాడని శ్రవణ్‌పై కోపం పెంచుకున్న యువతి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి కారులో జూబ్లీహిల్స్ కృష్ణకాంత్ పార్కు వద్దకు రింకీ వెళ్లింది. అక్కడకు ఆ యువకుడిని పిలిచింది.
ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?