ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్‌లో దారుణం జరిగింది. డబ్బు విషయంలో వివాదం తలెత్తడం వల్ల ఓ ప్రియురాలు తన ప్రియుడిని హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి తీసుకెళ్లి అడవిలో తగలబెట్టింది. మృతుడిని చంద్ర భూషణ్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతుడు చంద్ర భూషణ్ కనిపించట్లేదని అతడి కుటుంబ సభ్యులు మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కోట్నా పానీ అడవుల్లో రెండు రోజుల క్రితం గుర్తు తెలియని సగం కాలిన మృతదేహం స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం చంద్ర భూషణ్దిగా గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దర్యాప్తులో భాగంగా రాగిణి సాహు అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చంద్ర భూషణ్.. రాగిణితో ప్రేమలో ఉన్నాడు. అయితే రాగిణికి చంద్ర భూషణ్ కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. ఇటీవల రాగిణికి.. చంద్రభూషణ్‌కు డబ్బు విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాగిణిని చంద్ర భూషణ్ పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి వేధించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన రాగిణి.. నూతన సాహు అనే స్నేహితుడితో కలిసి కలిసి చంద్రభూషణ్‌ను హత్య చేసింది. అనంతరం కోట్నా పానీ అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టింది.
నాటు తుపాకీ మిస్‌ఫైర్..
నాటు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి ఏడేళ్ల బాలుడు మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటక.. రామనగరలో జరిగింది. మృతుడిని షామాగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమీనుల్లా, సామ్‌సూన్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి మల్లేశ్ అనే వ్యక్తి ఫాంహౌస్‌కి పొలం పని నిమిత్తం వచ్చారు. తల్లిదండ్రులు పొలం పనుల్లో బిజీగా ఉండగా.. వీరి పిల్లలు మల్లేశ్ ఫాంహౌస్‌లోకి వెళ్లి నాటుతుపాకీతో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడు ఆడుకుంటూ తుపాకీ ట్రిగ్గర్ నొక్కడం వల్ల చిన్నారి కుమారుడికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నాటు తుపాకీ కలిగి ఉన్న యజమాని మల్లేశ్‌ను, కాల్పులు జరిపిన బాలుడిని అరెస్ట్ చేశారు.