తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోన్​ కాల్స్​ చిచ్చు.. ప్రియురాలి తలను నేలకేసి కొట్టి హత్య - దిల్లీ మర్డర్​

Girlfriend killed her boyfriend: ప్రేమికుల మధ్య ఓ ఫోన్​ కాల్​ చిచ్చు పెట్టింది. హోటల్​లో ఉన్న సమయంలో నిరంతరాయంగా ఫోన్లు రావటంపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి.. ఘర్షణకు దారి తీసింది. దీంతో ప్రియురాలి తలను నేలకేసి కొట్టటం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. దిల్లీలో ఈ ఘటన జరిగింది.

girlfriend killed her boyfriend
ప్రియురాలి తలను నేలకేసి కొట్టి హత్య

By

Published : Mar 2, 2022, 12:12 PM IST

Girlfriend killed her boyfriend: హోటల్​ గదిలో ఉండగా మరో వ్యక్తి నుంచి నిరంతరాయంగా వస్తున్న ఫోన్​ కాల్స్​తో ఆగ్రహించిన ఓ వ్యక్తి తన ప్రియురాలి తలను నేలకేసి కొట్టి హత్య చేశాడు. ఈ సంఘటన దిల్లీలోని వసంత్​ కుంజ్​ ప్రాంతంలోని హోటల్​ లాక్​ రెసిడెన్సీలో గత ఆదివారం జరిగింది.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​, గాజియాబాద్​కు చెందిన శివమ్​ చౌహాన్​కు(28).. దిల్లీ వసంత్​ కుంజ్​లోని కిశన్​గఢ్​ ప్రాంతానికి చెందిన మహిళతో నాలుగేళ్లుగా సంబంధం ఉంది. గత శుక్రవారం ఇరువురు హోటల్​ లాక్​ రెసిడెన్సీకి వచ్చారు. అయితే, మరుసటి రోజున చౌహాన్​ ఒక్కడే బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత.. గదిలో మహిళ మృతి చెందినట్లు గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

నిందితుడు అరెస్ట్​

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మితౌలీ ప్రాంతంలో అరెస్ట్​ చేశారు. విచారణ సందర్భంగా.. హోటల్​ గదిలో జరిగిన విషయాన్ని నిందితుడు వెల్లడించినట్లు డీసీపీ గౌరవ్​ శర్మ తెలిపారు.

'నా ప్రియురాలు.. నన్ను మోసం చేసి ఉత్కర్ష్​ అనే వ్యక్తితో కొద్ది రోజులుగా సంబంధం పెట్టుకుంది. శుక్రవారం హోటల్​లో ఉండగా నిరంతరాయంగా ఫోన్​ కాల్స్​ వచ్చాయి. ఫోన్​ విషయాన్ని అడగగా ఉత్కర్ష్​ తన సోదరి ప్రియుడిగా చెప్పింది. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.' అని చెప్పాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే తన ప్రియురాలి తలను నేలకేసి బలంగా కొట్టటం వల్ల తీవ్ర రక్త స్రావమై అక్కడే మృతి చెందగా.. హోటల్​ గదిలోనే వదిలేసి పారిపోయాడని చెప్పారు.

ఇదీ చూడండి:ఘరానా మోసాల కుటుంబం.. రూ.100 కోట్లకుపైగా టోకరా

ABOUT THE AUTHOR

...view details