Girlfriend Cut Boyfriend Private Part :తన స్నేహితురాలితో శారీరక సంబంధం పెట్టుకోలేదని ఆగ్రహించిన ప్రియురాలు.. ప్రియుడి జననాంగాన్ని కొరికేసింది. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది
చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే, అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి ఒంటరిగా వెళ్లాడు. ఈ సమయంలోనే అతడి ప్రియురాలు.. ఆమె స్నేహితురాలని సైతం అక్కడికి పిలిచింది. తన స్నేహితురాలితో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. దీనికి ప్రియుడు నిరాకరించడం వల్ల ఆగ్రహించిన ప్రియురాలు.. అతడి జననాంగాన్ని నోటితో కొరికింది.
ప్రియుడు గట్టిగా అరవడం వల్ల స్థానికులు.. ఘటనా స్థలానికి వచ్చారు. వీరిని గమనించిన బాధితుడు.. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి పారిపోయాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావంలో ఉన్న బాధితుడు.. ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని.. పోలీసులకు సైతం చెప్పొద్దని భార్యకు వివరించాడు. భర్త పరిస్థితి విషమించడం వల్ల భయపడిన భార్య.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని చౌబేపుర్ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి కాన్పూర్‌లోని జిల్లా ఆస్పత్రికి పంపించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.