తెలంగాణ

telangana

ETV Bharat / bharat

4 గంటల్లో 25కి.మీ స్విమ్మింగ్.. సముద్రంలో పదేళ్ల బాలిక సాహసం - indian book of records swimming record

ఆరో తరగతి విద్యార్థి అరుదైన రికార్డ్ సృష్టించింది. 4 గంటల 48 నిమిషాల్లో 25 కిలోమీటర్లు ఈతకొట్టి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించింది.

girl swimmer
4 గంటల్లో 25కి.మీ స్విమ్మింగ్.. సముద్రంలో పదేళ్ల బాలిక సాహసం

By

Published : Apr 26, 2022, 3:18 PM IST

చెన్నైకి చెందిన సంజన(10) అరుదైన ఘనత సాధించింది. సముద్రంలో 4 గంటల 48 నిమిషాలపాటు నిర్విరామంగా ఈత కొట్టి.. 25 కిలోమీటర్లు ప్రయాణించింది. సోమవారం ఈ సాహసం చేసిన సంజన.. ఇండియన్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది. సంజన.. చెన్నైలోని కొత్తూర్​పురానికి చెందిన పెరుమాళ్​-సంధ్య దంపతుల కుమార్తె. ఆరో తరగతి చదువుతోంది.

ఈతపై ఆసక్తితో చిన్నప్పటి నుంచే సాధన చేస్తోంది సంజన. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న సంకల్పంతో సోమవారం భారీ సాహసం చేసింది. ఉదయం ఆరున్నర గంటలకు వీజీపీ బీచ్​లో ఈత కొట్టడం ప్రారంభించి.. 11.30లోగా మెరీనా బీచ్​లోని కన్నగి విగ్రహం వద్దకు చేరుకుంది. సంజన సాధించిన ఘనతతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆనందంలో మునిగిపోయారు. తీరానికి చేరుకోగానే అభినందనల్లో ముంచెత్తారు. తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ కార్యదర్శి అపూర్వ.. సంజనను సత్కరించారు.

13 గంటల్లో శ్రీలంక టు ధనుష్​కోడి: పారా స్విమ్మర్​ జియా రాయ్​ ఇటీవల ఇదే తరహాలో సరికొత్త రికార్డు సృష్టించింది. శ్రీలంక తలైమన్నార్​, తమిళనాడు రామేశ్వరం మధ్య ఉన్న బక్​జల జంక్షన్​ను 13 గంటల్లోనే ఈదేసింది. మార్చి 20 సాయంత్రం ఈ ఘనత సాధించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాళ్లు, చేతులు కట్టేసుకొని 5 గంటలు ఈత: కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు అసాధారణ ఘనత సాధించారు. కాళ్లు, చేతులు కట్టేసుకొని అరేబియా సముద్రాన్ని నాలుగు గంటల 35 నిమిషాల్లోనే ఈదేశాడు. తద్వారా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details