Girl Suicide After Being Accused Of Cloths Theft :తమ బట్టలు దొంగతనం చేసిందని పక్కింటివారు చేసిన ఆరోపణలకు మనస్తాపం చెందింది ఓ బాలిక. దీంతో ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ కౌశాంబిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
కరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని అఢహరా గ్రామానికి చెందిన నకుల్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా భార్య మృతి చెందింది. నకుల్‌కు 14 ఏళ్ల కుమార్తె అనామిక ఉంది. అయితే, భార్య మృతి చెందడం వల్ల నకుల్.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. చదువులో చురకైన అనామికను.. తండ్రి, సవతి తల్లి ఇద్దరు కలిసి వేధించేవారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పక్కింట్లో ఉండే మహిళ.. అనామిక తమ బట్టలు దొంగతనం చేసిందని ఆరోపించింది. దీంతో ఆగ్రహించిన నకుల్.. అనామికను తీవ్రంగా కొట్టాడు. తండ్రి కొట్టడం వల్ల మనస్తాపానికి గురైన ఆమె.. కుటుంబసభ్యులు అందరూ పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
స్కూల్ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి
ఉత్తర్‌ప్రదేశ్ హథ్రాస్‌లో స్కూల్ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి చెందాడు. బస్సు వెనక్కి తీసుకుంటున్న క్రమంలో డ్రైవర్.. చిన్నారిని గమనించకుండా నడపడం వల్ల అక్కడిక్కడే మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.