ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురిలో దారుణం జరిగింది. 19 ఏళ్ల విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన భోగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఆ తర్వాత విద్యార్థిని మృతదేహానికి ఉరివేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని రప్పించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు(19) బీఎస్సీ రెండో సంవత్సరం చదివేది. తన సోదరితో కలిసి భోగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించేది. బాధితురాలి తల్లిదండ్రులు పని నిమిత్తం ఆగ్రాలో ఉంటున్నారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన పుష్పేంద్ర(25).. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడం వల్ల.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. కాసేపటి తర్వాత బాధితురాలి చెల్లి... గ్రామస్థులకు జరిగిన దారుణాన్ని తెలిపింది. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం తరలించారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
మహిళపై యాసిడ్ దాడి..
ఉత్తర్‌ప్రదేశ్ సంభల్‌లో దళిత మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ఎన్నికల్లో వివాదాల కారణంగా తన తల్లిపై యాసిడ్ దాడి జరిగినట్లు ఆమె కుమారుడు తెలిపాడు. పొలంలోకి ఈడ్చుకెళ్లి తన తల్లిపై ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
రైల్వే ఉద్యోగిపై..
హరియాణా పానీపత్‌లోని సనౌలీ రోడ్డులో దారుణం జరిగింది. డీజే శబ్దాలతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న ముగ్గురు వ్యక్తులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనలో మన్‌ప్రీత్ అనే రైల్వే ఉద్యోగి మరణించగా, అతని సహచరులు ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మన్‌ప్రీత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.