తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచారం చేసి అబార్షన్ చేయించిన యువకుడు బాధితురాలు మృతి - అబార్షన్ వికటించి యువతి మృతి

ప్రేమిస్తున్నానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. గర్బాన్ని తొలగించేందుకు అబార్షన్ చేయించడం వల్ల అది కాస్త ఫెయిలై బాధితురాలు మరణించింది. ​ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలో జరిగింది.

pregenent girl death abortion
గర్భిణీ మృతి

By

Published : Aug 13, 2022, 11:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్..​ వారణాసిలో దారుణం జరిగింది. కొన్ని నెలల క్రితం యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. అనంతరం బాలిక గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ఐదు నెలల తర్వాత బాధితురాలికి అబార్షన్ చేయించేందుకు నిందితుడు ప్రదుమ్ యాదవ్ ప్రయత్నించాడు. అబార్షన్ సమయంలో బాలిక మృతి చెందింది. దీంతో నిందితుడు పారిపోవడానికి యత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వారణాసిలోని చోలాపుర్ పోలీస్​స్టేషన్ పరిధిలో యువతి(23) తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. బాధితురాలి తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. యువతి కాలేజ్​కు​ వెళ్లే సమయంలో ప్రదుమ్ యాదవ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడు యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడం వల్ల అబార్షన్ చేసేందుకు నవపుర గణేశ్ లక్ష్మీ ఆసుపత్రికి యువకుడు తీసుకెళ్లాడు.

అబార్షన్ వికటించి యువతి మరణించడం వల్ల.. బాధితురాలి మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించాడు. అయితే ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితులు ప్రదుమ్ యాదవ్, అనురాగ్ చౌబే, ఆసుపత్రి ఆపరేటర్ షీలా పటేల్, డాక్టర్ లాలన్ పటేల్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇవీ చదవండి:కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి దారుణ హత్య

లోన్​ యాప్​ వేధింపులు 2 వేల రూపాయలు ఇచ్చి 15 లక్షలు వసూలు

ABOUT THE AUTHOR

...view details