దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న యువతిని అతి దారుణంగా చంపిన వ్యక్తి.. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ముంబయికి చెందిన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు కాల్ సెంటర్‌లో పనిచేసే 26 ఏళ్ల శ్రద్ధా అనే యువతి పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి అతనితో సహ జీవనం చేస్తోంది. వీరి బంధాన్ని ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడం వల్ల ఇద్దరూ ముంబయి నుంచి దిల్లీకి పారిపోయి.. మెహ్‌రౌలీ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు. పెళ్లి విషయంలో తరచూ జరిగే గొడవలు తీవ్రమై మే 18న శ్రద్ధాను అమీన్ హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. 18 రోజులపాటు అర్ధరాత్రి 2గంటలకు దిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరేసి.. మృతదేహం జాడ లేకుండా చేశాడు.
యువతి దారుణ హత్య.. 35 ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో వేసిన బాయ్‌ఫ్రెండ్ - దిల్లీ హత్య
దిల్లీలో దారుణం జరిగింది. నమ్మి వచ్చి సహజీవనం చేస్తున్న యువతిని ఓ వ్యక్తి అతికిరాతకంగా గొంతుకోసి హత్యచేశాడు. ఆపై శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. 18 రోజుల పాటు రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేశాడు. యువతి తండ్రి ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది.
Girl murdered in love affair
శ్రద్ధా ఫోన్ ఎత్తకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులకు అనుమానం మొదలైంది. ఈనెల 8న శ్రద్ధా తండ్రి దిల్లీలో వారు నివసించే ఫ్లాట్‌కు వెళ్లగా తాళం వేసి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అమీన్‌ను అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. పదేపదే పెళ్లిచేసుకోవాలని శ్రద్ధా ఒత్తిడి చేయడం వల్లే హత్య చేసినట్లు వివరించాడు. ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్న పోలీసులు అమీన్ ఇచ్చిన సమాచారంతో మృతదేహం ఆనవాళ్ల కోసం గాలిస్తున్నారు