తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీచ్​లో విగతజీవిగా 18 ఏళ్ల యువతి.. అసలేం జరిగింది? - దారుణ హత్య

Girl murdered by boyfriend: 18 ఏళ్ల యువతి గుర్తుపట్టలేని స్థితిలో బీచ్​లో విగతజీవిగా కనిపించిన కేసులో ఆమె మాజీ ప్రేమికుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. మరోవైపు.. ఉత్తర్​ప్రదేశ్​లో లైంగిక దాడిని ప్రతిఘటించిందని ఓ మహిళ రెండు కళ్లను పొడిచాడు దుండగుడు.

Girl murdered by boyfriend
బీచ్​లో విగతజీవిగా 18 ఏళ్ల యువతి

By

Published : May 7, 2022, 12:09 PM IST

Girl murdered by boyfriend: ముంబయిలోని వెర్సోవా బీచ్​లో కొద్ది రోజుల క్రితం 18 ఏళ్ల యువతి మృతదేహం లభించటం కలకలం రేపింది. ఈ కేసును వారం రోజుల్లోనే ఛేదించారు పోలీసులు. బాధితురాలి మాజీ ప్రేమికుడిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. మృతురాలు గోరేగావ్​లోని ప్రేమ్​నగర్​లో ఉంటూ నీట్​ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సైతం అదే ప్రాంతానికి చెందిన వాడిగా చెప్పారు.

మృతురాలు సోనమ్​

"యువతి మృతి కేసులో మొబైల్​ కాల్స్​, చాట్స్​, బంధువులు ఇచ్చిన సమాచారంతో ప్రేమ్​నగర్​కు చెందిన మొహమ్మద్​ షాజెబ్​ అన్సారీని (23) అరెస్ట్​ చేశాం. ఇరువురు కొద్ది రోజులు ప్రేమించుకుని విడిపోయారు. ఏప్రిల్​ 25న సాయంత్రం 4 గంటలకు బాధితురాలు ట్యూషన్ కోసం ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాలేదు. ట్యూషన్​ క్లాస్​కు వెళ్లకుండా స్నేహితుల ఇంటికి వెళ్లింది. రాత్రి 9.30 దాటినా తిరిగి ఇంటికి రాకపోయే సరికి సోనమ్​ తండ్రి ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుల ఇంట్లో కాసేపు ఉండి వస్తానని చెప్పిందని, రాత్రి 11.30 దాటినా రాలేదని పేర్కొన్నాడు. 11 గంటల ప్రాంతంలో బాధితురాలి ఫోన్​ స్విచ్​ఆఫ్​ అయినట్లు చెప్పాడు. "

- గోరేగావ్​ వెస్ట్​ పోలీసులు

ఏప్రిల్​ 28న వెర్సోవా బీచ్​లో కుళ్లిపోయిన స్థితిలో బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అన్సారీని అరెస్ట్​ చేసి విచారించగా.. నేరం అంగీకరించాడు. బాధితురాలు ఏప్రిల్​ 25 రాత్రి అన్సారీ ఇంటికి వెళ్లింది. ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన అన్సారీ ఇంటర్నెట్​ కేబుల్​తో గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి సముద్రంలో పడేశాడు. రాత్రి 10 తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్​ 201, 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండు కళ్లు పొడిచాడు:ఉత్తర్​ప్రదేశ్​లోని శ్రావస్తీ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. భర్తను కోల్పోయి ఒంటరిగా ఉండి.. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న మహిళను భోజనం పెడతాననే కారణంతో ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు సోనవా గ్రామానికి చెందిన దినేశ్​ సింగ్​ అనే యువకుడు. ఆమె ప్రతిఘటించే సరికి కోపంతో ఆమె రెండు కళ్లలో పదునైన ఆయుధంతో పొడిచాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి లాక్కొచ్చి బయటపడేశాడు. గమనించిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అరవింద్​ కుమార్​ మౌర్య.. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు అత్యాచార యత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కుమార్తెపై తండ్రి అత్యాచారం: 18 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బాందా జిల్లాలో గురువారం జరిగింది. తండ్రే అఘాయిత్యం చేయటం వల్ల మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది బాధితురాలు. జిల్లాలోని మార్కా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు ఏఏస్​పీ లక్ష్మీ నివాస్​ మిశ్రా తెలిపారు. గత గురువారం రాత్రి తండ్రి అఘాయిత్యానికి పాల్పడగా.. శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్​ చేసి విచారణ చేపట్టామన్నారు.

ఇదీ చూడండి:'పెళ్లికి తొందరెందుకు..? గర్భనిరోధక బాధ్యత మహిళలదే!'

ABOUT THE AUTHOR

...view details